కామారెడ్డి, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం టేక్రియాల్లోని కస్తూరిబా పాఠశాలను శుక్రవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే పరిశీలించారు. పాఠశాల, వసతి గృహం పరిసరాలను చూశారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పరిశుభ్రత పాటించాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో డిఇఓ రాజు, ఉపాధ్యాయునులు పాల్గొన్నారు.