నందిపేట్, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్ర వీఆర్‌ఎల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు సమ్మె చేపట్టనున్నట్లు శుక్రవారం నందిపేట్ వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ అనీల్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. గ్రామానికి సంబంధించిన విధులు నిర్వహిస్తామని, ఇతర విధులు నిర్వర్తించబోమని వారు తెలిపారు.
ఈ నెల 25 నుంచి తహసీల్దార్ కార్యాలయం ముందు సమ్మె చేయనున్నట్లు వారు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పేస్కేల్ జీఓను వెంటనే విడుదల చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 55 సంవత్సరాల వయస్సు పైబడిన వి.ఆర్‌ఏల వారసులకు ఉద్యోగం ఇచ్చి వారికి పెన్షన్ సౌకర్యం కలిగించాలని సమ్మె నోటీసులో పేర్కొన్నారు. కార్యక్రమంలో విఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు వేముల సాయన్న, ఉపాధ్యక్షుడు సుంకరి గంగాధర్, ప్రధానకార్యదర్శి కదం రాజేందర్, వివిధ గ్రామాల విఆర్‌ఏలు వున్నారు.