కామారెడ్డి, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తీగజాతి కూరగాయల పందిరిని శనివారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవ్ రావు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, సీఈఓ రాజారాం పరిశీలించారు.రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వీరయ్య అనే రైతు బీర, సొర, కాకరకాయ తీగజాతి కూరగాయ పంటలను సాగు చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు మాట్లాడారు. ఉద్యానవన శాఖ ద్వారా రాయితీపై బిందు సేద్యాన్ని రైతు ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. తీగజాతి కూరగాయలు సాగు చేయడం వల్ల రైతులకు అధిక లాభాలు వస్తాయని పేర్కొన్నారు.