కామారెడ్డి, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడలో ఉన్న బస్తి దవాఖానాను శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే సందర్శించారు. ఆసుపత్రిలో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని సూచించారు. మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు.
సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. 15 రోజుల్లో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా వైద్య సిబ్బంది పట్టణంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, డి.ఇ. సాయన్న, మున్సిపల్ డిఈ వాసుదేవరావు, వైద్యులు పాల్గొన్నారు.