నందిపేట్, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఆలూరు గ్రామం నుండి వెల్మల్ గ్రామం మద్యమార్గంలో ఉన్న కల్వర్టు కొట్టుకపోవడం జరిగింది. దీంతో ఆర్మూర్ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రయాణీకుల రాక పోకలకు ఇబ్బంది కలుగకుండా నందిపేట్ వైస్ ఎంపీపీ దేవేందర్ బ్లేడ్ ట్రాక్టర్ సాయంతో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ చదును చేశారు. ప్రజల ఇబ్బందులు దూరం చేశారు. ఈ సందర్బంగా వైస్ ఎంపిపి దేవేందర్ మాట్లాడుతు ఆర్మూర్ ఎమ్మెల్యే పియుసి చెర్మన్ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నమని తెలిపారు. కాగా స్వయంగా వైస్ ఎంపిపి దేవేందర్ ట్రాక్టర్ నడుపుతూ రోడ్డు చదునుచేసిన వీడియో చూసి అందరు శభాష్ అంటున్నారు.