కామారెడ్డి, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఈ క్రింది సూచనలను పాటించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
1.దోమలను అరికట్టడానికి ఫాగింగ్ అన్ని గ్రామాల్లో చేయాలి.
- డ్రిరకింగ్ వాటర్ క్లోరినేషన్ జరగాలి. ఈ విషయంలో మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలి.
3.సురక్షిత/ కాచి చల్లార్చిన మంచి నీటి ఉపయోగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. - ఫంక్షన్స్, పెళ్లిల్లో మిగిలిన ఆహార పదార్థాలు మరుసటి రోజు తినకూడదని ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాటిని సెగ్రిగేషన్ షెడ్ కి తరలించాలి.
4.సీజనల్ వ్యాధులు, వరదల అనంతరం ప్రబలే వ్యాధులు, కలుషిత ఆహారం నీరు వల్ల వచ్చే వ్యాధులు పట్ల ప్రజలకు ఆరోగ్య శాఖ సహకారంతో అవగాహన కల్పించాలి. - జిల్లా, మండల స్థాయి అధికారులు సర్ప్రైజ్ విజిట్‌లు చేసి పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాలి..
- ప్రజలు నీటి ప్రవాహాలు దాటకుండా అనునిత్యం హెచ్చరికలు జారీ చేయాలి.
- నీరు నిల్వ ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేయాలి.
- హానికర క్రిములను నిరోధించడానికి బైటెక్స్, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాలు చల్లాలి.
- సోమవారం నుంచి స్కూల్స్ పునప్రారంభం అవుతున్నందున వాటిని శుభ్రపరచాలి.
- డ్రైనేజీలో వర్షాల వల్ల పూడిక నిండే అవకాశం ఉన్నందున పూడిక తీయించాలి.
- రాష్ట్ర స్థాయి బృందాలు, జిల్లా అధికారులు పర్యటిస్తున్నపుడు చూపడానికి వీలుగా చేపడుతున్న పనులకు సంబంధించిన ఫొటో రికార్డ్, వీడియో రికార్డ్‌లతో పాటు రిజిస్టర్‌లో నమోదు చేసి భద్రపర్చాలి.
- అందరూ అధికారులు హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లకూడదు.
13.ఈ అన్ని అంశాల పట్ల ప్రతి రోజు సమీక్ష మండల స్థాయిలో జరగాలి.
ప్రజలకు సూచనలు
1.కాచి చల్లార్చిన నీటినే త్రాగాలి, అప్పుడే వండిన ఆహార పదార్థాలను మాత్రమే తినాలి.
- పరిసరాల పరిశుభ్రతతో సహా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
- ఇంట్లో, పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్త పాటించాలి.
- వారంలో ఒక రోజు ఇంట్లో ఉన్న నీటిని పారబోసి అన్ని పాత్రలు కడిగి ఆరబెట్టుకొని డ్రై డే పాటించాలి.
- అన్ని వ్యాధులు, దోమలు, ఈగల వల్ల వస్తున్నందున వాటి వ్యాప్తిని అరికట్టాలి.