టిఆర్‌ఎస్‌ వెంటే కురుమ కులస్తులు

నందిపేట్‌, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌ వెంటే గొల్ల కురుమ కులస్తులు ఉంటారని నియోజక వర్గ కుల సంఘ నాయకులు వెల్లడిరచారు. ఆర్మూర్‌ నియోజకవర్గ కుర్మ సంఘ భవనానికి 50 లక్షల నిధులను ఆర్ముర్‌ ఎంఎల్‌ఏ, పియుసి చైర్మన్‌, టిఆర్‌ఎస్‌ జిల్లా ఆధ్యక్షులు జీవన్‌ రెడ్డి మంజూరు చేసిన సందర్బంగా ఆదివారం నందిపేట మండల కేంద్రంలో ఆర్మూర్‌ నియోజకవర్గ కుర్మ సంఘ సభ్యులంతా కలిసి ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గే మల్లేశం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ప్రభత్వము గొల్ల కురుమ కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు. ఆర్మూర్‌ నియోజకవర్గ కురుమ కుల భవన నిర్మాణంలో భాగంగా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి కుర్మ సంఘ భవన నిర్మాణానికి కోటి రూపాయల నిధుల హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దీనిలో భాగంగానే ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సహకారంతో ఎమ్మెల్సీ ఎగ్గం మల్లేశం తన నిధుల నుండి యాభై లక్షలను మంజూరు చేశారన్నారు.

రాజ్యసభ సభ్యుడు సురేష్‌ రెడ్డి అలాగే ఎంఎల్‌సి కవిత మరిన్ని నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నందిపేట ఎంపీపీ వాకిడి సంతోష్‌ రెడ్డి, కో ఆప్షన్‌ సయ్యద్‌ హుస్సేన్‌, ఎంపీటీసీ కొండూరు రాజు, కొండూర్‌ సర్పంచ్‌ ప్రబాకర్‌ నియోజకవర్గ కురుమ కుల నాయకులు, తొండాకూర్‌ సర్పంచ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవన్న, ఆర్మూర్‌ నియోజకవర్గ యూత్‌ ఇన్చార్జ్‌ కేజీ సురేష్‌, తల్వేధ ఎంపిటిసి లింగం, రాజశేఖర్‌, సతీష్‌, ఓరికే భూమన్న భోజన, నారాయణ, నవీన్‌ తదితర కురుమ కులస్తులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »