డిచ్‌పల్లి, జూలై 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రికి తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ సోమవారం ఉదయం పుష్పగుచ్చం అందించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆగస్ట్ 1,2,3 తేదీలలో ‘‘అల్ట్రాసోనిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ అడ్వాన్సుడ్ టెక్నాలజీ’’ అనే అంశంపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సందర్భంలో కాన్ఫరెన్స్‌కు చైర్మన్‌ను సగౌరవంగా ఆహ్వానించారు. దీనికి సంబధించిన బ్రోచర్‌ను ఆచార్య ఆర్. లింబాద్రి హైదరాబాద్‌లోని తన చాంబర్‌లో ఆవిష్కరించారు. బ్రోచర్ ఆవిష్కరణలో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌తో పాటు అసిస్టెంట్ ఇంజనీర్ వినోద్ కుమార్, సూపరిండెంటెండ్ బి. భాస్కర్, పి.ఎ. నవీన్ రాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కోసం అల్ట్రాసోనిక్స్ మరియు మెటీరియల్ సైన్స్ మీద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. కాన్ఫరెన్స్‌లో నానో, నేచురల్, మెడిసినల్, ఫార్మాస్యూటికల్, మెటీరియల్ సైన్స్ రంగాల్లో విస్తృతమైన అధ్యయనం, ఉన్నతమైన పరిశోధనా, నూతన ఆవిష్కరణలు జరుగుతాయన్నారు. అల్ట్రాసోనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామన్నారు.
ఈ నెల 25 వరకు సంక్షిప్త పరిశోధనా పత్రాలను కన్వీనర్‌కు పంపించి 28 వ తేదీ లోపు రీసోర్స్ పర్సన్స్ అనుమతి తీసుకోవలసి ఉంటుందన్నారు. కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు, సలహాల అనంతరం ఆగస్ట్ 10 వ తేదీన పూర్తి పత్రం పంపవలసి ఉంటుందన్నారు. కాన్ఫరెన్స్ సావనీర్ ప్రచురించబోతున్నట్లు తెలిపారు. దేశ, విదేశాల నుంచి శాస్త్ర, సాంకేతిక రంగాలలో కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, ప్రముఖులు విచ్చేస్తున్నారన్నారు. అమెరికా నుంచి ప్రొ. కె. వి. రామానుజాచారి, ప్రొ. జొన్నలగడ్డ సుభాష్, ప్రొ. మనోజ్ పాండె, ప్రొ. వెంకట్రాం మెరెడ్డి, ప్రొ. నేయిల్ ముచా, డా. పల్లవి చారి, డా. లూకస్ సొలానో, డా. రాబర్ట్ కిట్రన్, ప్రొ. రాం చెల్లప్ప, డా. బ్రియాన్ పెంగ్ జుక్, బెల్జియం నుంచి ప్రొ. క్రిస్ట్ గ్లోరిక్స్, సౌత్ ఆఫ్రికా నుంచి ప్రొ. ఎస్. బి. జొన్నలగడ్డ, తైవాన్ నుంచి ప్రొ. అలాన్ చాంగ్, ప్రొ. షెంగ్ హాంగ్ వాంగ్, జపాన్ నుంచి ప్రొ. కెంజి కావ గుచి, సింగపూర్ నుంచి డా. పలని బాలయ ఇంకా ఐ ఐ టి, యూజీసీ, సి ఎస్ ఐ ఆర్, డిబిటి, డిఎస్ టి తదితర సంస్థల నుంచి శాస్త్రవేత్తలు, ప్రముఖులు విచ్చేయనున్నట్లు ఆయన తెలిపారు.
కావున కాన్ఫరెన్స్ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత గుర్తింపును సంతరించుకోబోతున్న సందర్భంగా ఫాకల్టీ ఆఫ్ సైన్స్ రంగాలకు చెందిన అధ్యాపకులు, పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. కాన్ఫరెన్స్‌కు చీఫ్ ఫాట్రన్‌గా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, ఫాట్రన్‌గా రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, కన్వీనర్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. వాసం చంద్రశేఖర్, కో – కన్వీనర్‌గా అల్ట్రాసోనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ డా. యుధిష్టర్ కుమార్ యాదవ్, స్థానిక ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సత్యనారాయణ మావురపు వ్యవహరిస్తున్నారు.