నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం తెల్లవారుజామున రుక్మిణి చాంబర్స్ హైదరాబాదు రోడ్డు దగ్గర టిఎస్ 12 ల 9792 వ్యాన్ ద్వారా తరలిస్తున్న 140 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యంను పోలీస్ పెట్రోలింగ్ టీం పట్టుకోవడం జరిగిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాశ్ తెలిపారు. తదుపరి కేసు విచారణ నిమిత్తం పౌరసరఫరాల శాఖకు ఇవ్వడం జరిగిందన్నారు. విచారణ జరిపి 140 …
Read More »Daily Archives: July 19, 2022
భారత సేవాశ్రమ సంఘం ఆద్వర్యంలో ఉచిత నోటుపుస్తకాల పంపిణీ
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత సేవాశ్రమ సంఘం, హైదరాబాద్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాకు 11 వేల 500 నోటుబుక్కులు 2 వేల 300 మంది ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేయడానికి స్వామి వెంకటేశ్వర నందజి ఉచితంగా అందజేశారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పంపిణీ చేశారు. …
Read More »మానవ అక్రమ రవాణా జరగకుండా అవగాహన కల్పించాలి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ అక్రమ రవాణా జరగకుండా గ్రామస్థాయిలో అంగన్వాడి కార్యకర్తలు చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి లో ప్రజ్వల ఎన్జీవో ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారులు, బాలికలు ఇతరుల …
Read More »మహిళలు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని అమృత గ్రాండ్ హోటల్లో స్వయం సహాయక సంఘాలకు రుణ ప్రక్రియపై బ్యాంక్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సంఘాలకు మరింత చేయూతనివ్వవలసిన అవసరం …
Read More »