కామారెడ్డి, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ అక్రమ రవాణా జరగకుండా గ్రామస్థాయిలో అంగన్వాడి కార్యకర్తలు చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి లో ప్రజ్వల ఎన్జీవో ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారులు, బాలికలు ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా అంగన్వాడి కార్యకర్తలు అవగాహన కల్పించాలని కోరారు. గుడ్డ్ టచింగ్, బ్యాడ్ టచింగ్‌పై అవగాహన కల్పించాలని కోరారు. చిన్నారులు ఎత్తుకు తగిన బరువు ఉండే విధంగా చూడాలన్నారు. ఎత్తుకు తగిన బరువు లేకపోతే చిన్నారులకు అదనంగా పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఇంచార్జ్ ఐసిడిఎస్ పిడి రమ్య, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.