కామారెడ్డి, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని అమృత గ్రాండ్ హోటల్లో స్వయం సహాయక సంఘాలకు రుణ ప్రక్రియపై బ్యాంక్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
మహిళా సంఘాలకు మరింత చేయూతనివ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐకెపి ఉద్యోగులు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. స్వయం సహాయక సంఘాలకు లింకేజీ రుణాలు, స్త్రీ నిధి రుణాలు ఇవ్వడంలో ఈ సంవత్సరం కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. గత ఏడాది కూడా కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలోని ఉందని చెప్పారు.
స్వయం సహాయక సంఘాలకు రుణ ప్రక్రియపై రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ఎన్‌ఐఆర్డి రిసోర్స్ పర్సన్లు రవీందర్రావు, వెంకటస్వామి, నరసింహస్వామి అధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్‌డిఓ సాయన్న, అడిషనల్ డిఆర్‌డివోలు మురళి, మధుసూదన్, నాబార్డ్ ఏజీఎం నగేష్, చీప్ మేనేజర్ ప్రసాద్, డిపిఎంలు రవీందర్, నీలిమ, ఉమ్మడి జిల్లాల మేనేజర్లు ఫీల్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.