నిజామాబాద్, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువతీయువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, మనోవికాసానికి దోహదపడే చెస్ క్రీడను, క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ జిల్లా స్థాయిలో చెస్ టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయించిందని నిజామాబాద్ జిల్లా యువజన అధికారిని, నెహ్రూ యువ కేంద్ర శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
పోటీ రెండు విభాగాలుగా నిర్వహించబడుతాయని, 15 సంవత్సరాల నుండి 21 వయసు గల యువతీ యువకులు జూనియర్ విభాగంగా, 22 నుండి 29 సీనియర్ విభాగంగా గుర్తించబడతారని పేర్కొన్నారు. లింగబేధం లేకుండా పోటీలు నిర్వహించబడతాయన్నారు.
పోటీలు జులై 25వ తేదీ ఉదయం 11 గంటల నుండి ప్రారంభం అవుతాయని, సుభాష్ నగర్‌లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలోనే పోటీలు నిర్వహించబడతాయన్నారు. న్యాయ నిర్ణేతలుగా సీనియర్ చేస్ క్రీడాకారులు, జిల్లా యువజన అధికారి వ్యవహరిస్తారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు, కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వశాఖ ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. క్రీడాకారులు జులై 23 శనివారం సాయంత్రం 5గంటల లోపు తమ పేర్లు వాట్సాప్ 7989220061 లో ద్వారా నమోదు చేసుకోవాలి, ఇతర వివరాలకు కూడా వాట్సాప్ ద్వారానే సంప్రదించవలసి ఉంటుందన్నారు.