డిచ్‌పల్లి, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ లైన్ ఫీజు కలెక్షన్ కోసం ఎంఓయు (మెమొరండం ఆఫ్ అండర్ స్టాండిరగ్) కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన ‘‘ఆన్ లైన్ గేట్ వే’’ ను బుధవారం ఉదయం వీసీ తన చాంబర్‌లో ఎస్‌బిఐ అధికారుల సమక్షంలో ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… తెలంగాణ విశ్వవిద్యాలయం నిరంతరం ఎస్‌బిఐ సేవలను వినియోగించుకుందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి సంబంధించి వివిధ రకాల పరీక్షల ఫీజులు గాని, అకడమిక్ ఫీజులు గాని విద్యార్థులు ఎస్‌బిఐలో ఓచర్స్ రూపంలోనే చెల్లించేవారన్నారు. నేటి నుంచి విద్యార్థుల కోసం ‘‘గేట్ వే’’ ద్వారా బ్యాంక్ లావాదేవీలన్నింటిని ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించే వెసలుబాటు కల్పించనున్నట్లుగా తెలిపారు.
వివిధ ఆఫీసులకు చెందిన చాలానాలు, డీడీలు చెల్లించివచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు తమ గూగుల్ పే, ఫోన్ పే తదితర ఆన్ లైన్ పద్ధతుల ద్వారా కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ విధానం విద్యార్థులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. అతి తక్కువ రోజుల్లో ఆన్‌లైన్ పేమెంట్ ప్రాసెస్ చేయడంలో ప్రోగ్రాం ఆఫీసర్ ఉదయ్ కుమార్ కృషి అధికమైందని ప్రశంసించారు. కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, ఎస్‌బిఐ రీజినల్ మేనేజర్ ఎం. శ్రీకాంత్, ఏజిఎం హైదరాబాద్ బి. ఎస్. రఘునాథ్ రావు, చీఫ్ మేనేజర్ ఎ. శ్రీకాంత్, బ్రాంచ్ మేనేజర్ ఎం. రవికుమార్, ప్రోగ్రాం ఆఫీసర ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.