నిజామాబాద్, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రాంచంద్రపల్లి శివారులోని జాతీయ రహదారి 63 పక్కన దొడ్డిండ్ల పోశెట్టి (40)ని గుర్తు తెలియని దుండగులు వెంటాడి దాడిచేసి హత్యచేసిన అనంతరం చెట్టుకు ఉరివేసి మరీ నిప్పు పెట్టారు. ఈ ఘటన రాంచంద్రపల్లిలో ఒక్కసారిగా కలకలం రేపింది. మృతుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు.
గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే పోశెట్టిని అతికిరాతకంగా దాడి చేసిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆర్థిక లావాదేవీలు సజావుగానే ఉన్నాయని, బుధవారం భూ వివాదంలో ఉన్న కేసు విషయంలో కోర్టుకు హాజరు కావాల్సి ఉందని మృతుని కుమారుడు తెలిపాడు. తన తండ్రిని చంపిన వారిని శిక్షించాలని నిజామాబాద్ పోలీసు కమీషనర్ నాగరాజుకు విజ్ఞప్తి చేశారు.
సంఘటన స్థలాన్ని నిజామాబాద్ అసిస్టెంట్ పోలీసు కమీషనర్ వెంకటేశ్వర్, సిఐ ఎస్‌ఐ యాదగిరి గౌడ్ పరిశీలించారు. కుటుంబ సభ్యులు నలుగురు అనుమానితులపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఏసిపి తెలిపారు. క్లూస్ టీం వచ్చిన అనంతరం మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్దం సిమిత్తం తరలిస్తామని ఆయన తెలిపారు.