డిచ్పల్లి, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వామపక్ష విద్యార్థి సంఘాల విద్యాసంస్థల బంద్ పిలుపు మేరకు బుధవారం డిచ్పల్లి మండల కేంద్రంలో పాఠశాలలు కళాశాల తరగతులు బహిష్కరించి బంద్ చేయించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు డివిజన్ అధ్యక్షుడు అరుణ్, పివైఎల్ జిల్లా కార్యదర్శి సాయినాథ్ మాట్లాడుతూ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు.
విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లులు అందలేదన్నారు. ఇంకా కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. సమస్యలన్ని పరిష్కారమయ్యే వరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో గణేష్, శ్రీకాంత్, విజయ్, రాము, నరేష్ తదితరులు పాల్గొన్నారు.