వ్యాధిగ్రస్థుల గుర్తింపు ప్రక్రియ ముమ్మరం చేయాలి

కామారెడ్డి, జూలై 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధ్యమైనంత త్వరగా టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలని జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్‌ సింగ్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్షయ, కుష్టు, హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ సిబ్బంది, లెప్రసి ఎడ్యుకేషన్‌, ఎన్జీవోల జిల్లా సమన్వయకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సాధారణ ఓపి ద్వారా క్షయ వ్యాధిగ్రస్థుల గుర్తింపు ప్రక్రియ ముమ్మరం చేయాలని సూచించారు. టీబీ వ్యాధిగ్రస్తులకు ని-క్షయ పోషణ యోజన ద్వారా అందించే 500రూ.ల వారికి అందేలా చూడాలని పేర్కొన్నారు. హెచ్‌.ఐ. వి, ఎయిడ్స్‌ సిబ్బందితో సమీక్ష నిర్వహించి పూర్తి స్థాయిలో ఎన్‌.జి.ఓల సహకారం తీసుకొని ఎయిడ్స్‌ బాధితులను గుర్తించాలని కోరారు. ఎయిడ్స్‌ సంక్రమించకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

క్షయ సిబ్బంది సహకారంతో వ్యాధిగ్రస్థులకు సరైన వైద్యం అందేలా చూడాలన్నారు. కుష్టు వ్యాధి నివారణ సిబ్బంది తో సమీక్ష చేశారు. వీలైనంత కుష్టు వ్యాధిగ్రస్థులను సైతం గుర్తించి, వైద్యం అందించాలని తెలిపారు. జాతీయ లెఫ్రాసి ఎడ్యుకేషన్‌ ఫోగ్రామ్‌ గురించి తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డా.పావని, జిల్లా టి.బి కో ఆర్డినేటర్‌ నీలిమా, జిల్లా ఎయిడ్స్‌ ప్రోగ్రాం అధికారి సుధాకర్‌, డిపిపిఎం శోభారాణి, టీబీ సిబ్బంది, కుష్టు వ్యాధి సిబ్బంది, హెచ్‌.ఐ. వి, ఎయిడ్స్‌ సిబ్బంది, లెప్రసీ ఫోర్‌ గ్రామ్‌ డిపిఎంలు జీవన్‌, ప్రదీప్‌ గౌడ్‌, ఎన్‌.జి.ఓ ప్రతినిధులు రాజేందర్‌ రావు, రాణి, రమేష్‌ పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »