కామారెడ్డి, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత గల జంటలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం జనాభా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని కోరారు. కాన్పుల మధ్య ఎడం పాటించాలని సూచించారు. ఉత్తమంగా సేవలందించిన ఉద్యోగులకు ఈ సందర్భంగా కలెక్టర్ సన్మానం చేశారు. కాయకల్ప అవార్డు పొందిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్,ఉప వైద్యాధికారులు శోభారాణి, చంద్రశేఖర్, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.