ఆర్మూర్, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోటర్ సైకిళ్లను చోరీ చేస్తున్న పెర్కిట్‌కు చెందిన మహ్మద్ వాహీద్ అలీ (19) అనే దొంగను అరెస్టు చేసి పది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్ పోలీసు కమీషనర్ కె.ఆర్. నాగరాజు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్దులగుట్ట వెనక గల దోబీఘాట్ వద్ద 63వ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా మోటర్ సైకిల్‌పై వెళుతున్న వాహీద్ అలీని పట్టుకొని విచారించినట్టు తెలిపారు.
జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్‌లోని 1వ టౌన్, నిజామాబాద్ రూరల్, జగిత్యాల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొంత కాలంగా పార్కింగ్ చేసి ఉంచిన బైకులను దొంగతనం చేసేవాడని విచారణలో తేలిందని, పెర్కిట్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు విచారణ చేసి ఉదయం 4 గంటలకు అరెస్టు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న మోటర్ సైక్తిళ్లలో ఆర్మూర్‌లో 2, బాల్కొండలో 2, నిజామాబాద్ 1వ టౌన్‌లో 2, నిజామాబాద్ రూరల్‌లో 2, నిర్మల్, రాయికల్, గుడి హత్నూర్‌లలో ఒక్కో బైక్ చోరీ చేసినట్టు తెలిపారు.
పది కేసులలో పది మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వాటి విలువ 5 లక్షల 45 వేల వరకు ఉంటుందన్నారు. ఇదివరకే వాహీద్ అలీపై ఆర్మూర్ పోలీసు స్టేషన్‌లో 2021లో బైక్ దొంగతనాల కేసు ఉన్నట్టు వారు తెలిపారు. ఆర్మూర్ ఏసిపి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో సిఐ సురేశ్‌బాబు, ఎస్‌ఐలు ప్రదీప్ కుమార్, శ్రీకాంత్, ఏఎస్‌ఐలు గఫర్, సలీం, కానిస్టేబుల్ఫు గంగా ప్రసాద్, బి.ప్రసాద్, ఆనంద్ కేసును ఛేదించినట్టు తెలిపారు. వీరికి రివార్డులు ఇచ్చి అభినందించారు.