కామారెడ్డి, జూలై 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని మైనార్టీ బాలికల స్కూల్, జూనియర్ కళాశాలలో సోమవారం మధ్యాహ్న భోజనాన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్ పరిశీలించారు.
విద్యార్థులకు వండే బియ్యాన్ని, పప్పులను చూశారు. వంటశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థీనులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని పేర్కొన్నారు.