కామారెడ్డి, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మమత (28) గర్భిణీ స్త్రీ రక్తహీనతతో బాధపడుతుండడంతో వారి బంధువులు రెడ్ క్రాస్, ఐవిఎఫ్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. ఈ విషయాన్ని అడ్లూరు ఎల్లారెడ్డి వార్డు సభ్యుడు శ్రీకాంత్ రెడ్డికి తెలియజేయడంతో కామారెడ్డికి పట్టణానికి చెందిన శ్రీకాంత్ వెంటనే స్పందించి బి పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందించి ప్రాణాలు కాపాడారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచనల మేరకు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు, మహిళల కోసం ఎల్లవేళలా రక్తాన్ని అందజేయడం జరుగుతుందని, కుటుంబ సభ్యులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం అవసరం ఉన్నట్లయితే 9492874006 నెంబర్‌కి సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది చందన్, యేసు, రాజు, నవీన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.