కామారెడ్డి, జూలై 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులలో సామర్ధ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ ఆదర్శ పాఠశాలలో జిల్లాస్థాయి ఉపాధ్యాయుల అవగాహన సదస్సు హాజరై మాట్లాడారు. తొలిమెట్టు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులందరికీ చదవడం, రాయడం, చతుర్వేద ప్రక్రియలు నేర్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు.
ఆగస్టు 15 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని సూచించారు. విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. విద్యార్థుల సంఖ్యను పెంచవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా విద్యాధికారి రాజు, మండల విద్యాధికారి యూసెఫ్, ప్రిన్సిపాల్ భానుమతి, వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్, సమన్వయకర్తలు శ్రీపతి, గంగా కిషన్, వేణు శర్మ, జిల్లా రిసోర్స్ పర్సన్‌లు సురేందర్, లింబాద్రి, హరి ప్రసాద్, జరీనా, మండల రిసోర్స్ పర్సన్ నందు రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.