కామారెడ్డి, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా కూచన్ పల్లి గ్రామానికి చెందిన నవ్య (26) గర్భిణీకి అత్యవసరంగా ఏబీ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం మెదక్ జిల్లా కేంద్రంలో లభించకపోవడంతో వారు ఐవిఎఫ్ రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన నాగిర్తి రమేష్ రెడ్డికి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి, రాత్రివేళ అయినా సరే రక్తదానం చేశారన్నారు.
పదివేల మందిలో కేవలం 500 నుండి 1000 మందిలో మాత్రమే ఏబి నెగిటివ్ రక్తం ఉంటుందని తెలిపారు. నేటి సమాజంలో తోటి వారికి సహాయం చేయాలంటే ఎంతగానో ఆలోచించడం జరుగుతుందని అలాంటిది ఆపదలో ఉన్న గర్భిణీ స్త్రీ కోసం అడగగానే రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత రమేష్ రెడ్డికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున, ఐవిఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రపంచంలో ఎన్నో రకాలైన దానాలున్నప్పటికీ రక్తదానానికి పెంచిన దానం మరొకటి లేదని, డబ్బుతో సంబంధం లేకుండా చేయగలిగే సేవా కార్యక్రమం రక్తదానమని అన్నారు. గత 14 సంవత్సరాల నుండి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడుతున్నామని ఎవరికైనా అత్యవసర పరిస్థితిలో రక్తం అవసరం ఉన్నట్లయితే 9492874006 నెంబర్ కి సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఏసు, చందన్ పాల్గొన్నారు.