సి.ఎస్‌.,డి.వో.లు చాకచక్యంగా వ్యవహరించాలి

నిజామాబాద్‌, జూలై 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు ఒకటవ తేదీ నుండి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలలో చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్మెంటల్‌ అధికారులు చాకచక్యంగా వ్యవహరిస్థూ పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ అన్నారు. గురువారం ఉదయం నిజామాబాద్‌ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల (ఖిల్లా) లో నిర్వహించిన చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్మెంటల్‌ అధికారుల సమావేశంలో జిల్లా ఇంటర్‌ విద్య అధికారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఎండాకాలంలో జరిగేవని ప్రస్తుతం వర్షాకాలంలో నిర్వహిస్తున్నందున ప్రత్యేక పరిస్థితులు నెలకొంటాయని అన్నారు.

ఉదయం మొదటి సంవత్సరము, మధ్యాహ్నం రెండవ సంవత్సరం విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి పరీక్షలకు ముందు చేయాల్సిన పనులను, అలాగే పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు చేయాల్సిన పనులను, పరీక్షలు పూర్తయిన తర్వాత చేయాల్సిన పనులను జాగ్రత్తగా నిర్వహించాలని అన్నారు. ఏ సమస్యనా ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పోలీస్‌ స్టేషన్‌ నుండి ప్రశ్న పత్రాలు తీసుకుని వెళ్లినప్పుడు వర్షాకాలం కావున తాగిన జాగ్రత్తలు పాటించాలని, జవాబు పత్రాల బండిలను ప్లాస్టిక్‌ కవర్లలో చుట్టి ప్యాక్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షల జవాబు పత్రాల బండల్లను పోలీస్‌ స్టేషన్‌లోనే డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందని అన్నారు. సి.ఎస్‌., డి.ఓ.లు ప్రశ్నపత్రాలను తీసుకెళ్లేటప్పుడు జవాబు పత్రాలను పోస్ట్‌ ఆఫీస్‌ కు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వర్షాకాలంలో తగిన చర్యలు తీసుకుని పనులు నిర్వహించాలని అన్నారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

విద్యార్థులకు మంచినీటి వసతి, వాష్‌ రూమ్‌ల ఏర్పాటు, మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు రాసేందుకు ప్రోత్సహించాలని అన్నారు. హాల్‌ టికెట్లు ఆన్‌లైన్‌లో కూడా విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు అని, ప్రిన్సిపాల్‌ సంతకాలు అవసరం లేదని అన్నారు.

వర్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీ రవి కుమార్‌, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిరంజీవి, కనక మహాలక్ష్మి, ధర్పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజీయుధిను, నిజామాబాద్‌ ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపాల్‌ యకీనుద్దీన్‌, అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు నర్సయ్య, ప్రధానకార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. జిల్లాలోని 36 పరీక్ష కేంద్రాల నుంచి చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్మెంటల్‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »