కామారెడ్డి, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు ఒకటి నుంచి కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఇంటింటా సర్వే నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కొత్త ఓటర్ల నమోదుపై తహసిల్దార్లతో సమావేశం నిర్వహించారు.
ఈనెల 30న నియోజకవర్గాల వారిగా రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటర్ల ఆధార్ వివరాలు లీక్ కాకుండా చూడాలని కోరారు. జనవరి 1, ఏప్రిల్ ఒకటి ,జులై 1, అక్టోబర్ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకొని 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు కొత్త ఓటర్లుగా మీసేవ, ఆన్లైన్ కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితాలో పొరబాట్లు లేకుండా చూసుకోవాలని కోరారు. ఆగస్టు ఒకటి నుంచి బూత్ లెవల్ అధికారుల వద్ద నూతన ఫారాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గరుడయాప్ ప్రాముఖ్యతను తెలిపారు. సమావేశంలో ఆర్డిఓ రాజా గౌడ్, ఏవో రవీందర్, డిప్యూటీ తహసిల్దార్ ప్రియదర్శిని, అధికారులు నరేందర్, బాలయ్య పాల్గొన్నారు.