డిచ్‌పల్లి, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విజ్ఞాన సౌధ (జనరల్ లైబ్రరీ) కి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజక వర్గ శాసన సభాసభ్యులు మరియు రోడ్లు, భవన నిర్మాణాలు, శాసన సభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తరఫున తెలంగాణ విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు పోటీ పరీక్షల పుస్తకాలను వితరణ చేశారు.
తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటిస్తున్న 90 వేల ఉద్యోగాల కోసం తెలంగాణ యువత ఎంతో శ్రద్ధతో, నిబద్ధతతో, అకంఠిత దీక్షతో శిక్షణ పొందుతున్న నేపథ్యంలో వివిధ పోటీ పరీక్షలకు మౌలికమైన అధ్యయన సామాగ్రిని అందిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డిలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి పుస్తకాలు, అదే విధంగా శిక్షణ కోసం ‘‘ఇ – కోచింగ్ యాప్’’ ను నడిపిస్తున్నారు.
టీయూలో గ్రూప్ 1, 2, 4, ఎస్సై కానిస్టేబుల్ పోలీస్, ఉపాధ్యాయ తదితర ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థులకు భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారతదేశ భౌగోళిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, భారతదేశ రాజనీతి శాస్త్రం, సుపరిపాలన, భారతదేశ చరిత్ర, రాజకీయం, తెలంగాణ ఈవెంట్, జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, జనరల ఇంగ్లీష్, కరెంట్ అఫైర్, ఆర్థమెటిక్, రీజనింగ్ వంటి సబ్జెక్ట్ లకు సంబంధించిన స్టడీ మెటీరియల్ అందించారు. విద్యార్థులందరు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని అన్నారు.
కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంతన్న యువసేన సభ్యులు శ్రీనివాస్ గౌడ్, భీమ ప్రసాద్, ప్రతాప్, ఆచార్య పి. కనకయ్య, డా. నాగరాజు, డా. జి. బాలశ్రీనివాస మూర్తి, డా. ఘంటా చంద్రశేఖర్, డా. వి. త్రివేణి, డా. అబ్దుల్ ఖవి, డా. స్వామి, లైబ్రేరియన్ సత్యనారాయణ, వినోద్ కుమార్, సాయాగౌడ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.