టీయూను సందర్శించిన యూకే బిపిపి యూనివర్సిటీ అధికారులు

డిచ్‌పల్లి, జూలై 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్రిటన్‌ (యూకే) లోని బిపిపి యునివర్సిటీ అధికారులు తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం ఉదయం సందర్శించారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ వారికి సాదర స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చారు. యూకేలోని అతి పెద్ద స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రతిష్ఠాత్మకమైన బిపిపి యూనివర్సిటీ అధికారులు తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలతో ఎంఒయు కుదుర్చుకొనే ఉద్దేశంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు కాకతీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యా పాఠ్యాంశాల ప్రామాణికతను, పరిశోధనా నైపుణ్యాలను పరిశీలిస్తూ తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలు, కోర్సుల వివరాలు, అధ్యాపకుల అర్హతలు, పరిశోధనా సామర్థ్యం వంటివి వీసీని అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ పరంగా వివిధ ప్రాజెక్టుల్లో ప్రాతినిథ్యం వహించిన అధ్యాపకులు, పరిశోధకుల గురించి అడిగి తెలుసుకున్నారు. సామాజిక మరియు వాణిజ్య రంగాలలో జరిగిన కృషిని తెలుసుకున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోభివృద్ధిని సాధిస్తూ ముందుకు వెళ్తున్న విషయాన్ని వీసీ వారికి వివరించారు.

స్టాన్‌ ఫర్డ్‌ యూనివర్శిటీ సర్వే ప్రకారం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్తలలో ర్యాంక్‌ సాధించిన విషయాన్ని తేటపరిచారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అకడమిక్‌ మరియు రీసర్చ్‌ పురోభివృద్ధికి సంతృప్తి చెందిన యూకే బిపిపి యూనివర్సిటీ అధికారులు తమ ఎంఓయు (మెమొరండం ఆఫ్‌ అండర్‌ స్టాండిరగ్‌) కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో యూకే బిపిపి బిజినెస్‌ స్కూల్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ డీన్‌ సారాప్‌ా మికిల్‌ రాయ్‌, ఎడ్యూకేషన్‌ బిజినెస్‌ పార్టనర్‌ ఇండియా అండ్‌ నేపాల్‌ స్టూడెంట్‌ రిక్రూట్‌ మెంట్‌ ఆఫీసర్‌ తరణ్‌ జిత్‌, యూకే బిపిపి ఇండియా బృందం కీర్తన్‌, అఫ్రోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »