నిజామాబాద్, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందనే పక్కా సమాచారం మేరకు శనివారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని జిల్లా పౌర సంబంధాల అధికారి చంద్రప్రకాష్ తెలిపారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద నిర్వహించిన తనిఖీ సందర్భంగా లారీలో తరలిస్తున్న 292 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యం పట్టుబడిరదని వివరించారు.
బియ్యం నిల్వలను కరీంనగర్ నుండి మహారాష్ట్ర లోని ధర్మాబాద్ కు తరలిస్తున్నట్టు గుర్తించామని అన్నారు. అలాగే, దాస్ నగర్ చౌరస్తా వద్ద జరిపిన తనిఖీల్లో మరో లారీ పట్టుబడిరదని, సుమారు 280 క్వింటాళ్ళ బియ్యం లభ్యమయ్యిందని తెలిపారు.
బియ్యాన్ని కరీంనగర్ నుండి గుజరాత్‌కు తరలిస్తున్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. పట్టుబడిన లారీ డ్రైవర్లను విచారణ జరుపుతున్నామని డీఎస్‌ఓ చంద్రప్రకాష్ తెలిపారు. దాడుల్లో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డీ.టీ శ్రీనివాస్, సిబ్బంది దత్తాద్రి, ఎం.శ్రీనివాస్, నిఖిల్ రాజ్, రవీందర్, మధు తదితరులు పాల్గొన్నారని డీఎస్‌ఓ వివరించారు.