నిజామాబాద్, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 -24 సంవత్సరాలకు గాను పత్రిక విలేఖరులకు అందజేసే అక్రిడిటేషన్ కార్డులను మొదటగా జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తన ఛాంబర్లో అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు అందజేశారు.
మొదటి విడతగా 470 అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేసినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.పద్మశ్రీ, కమిటీ సభ్యులు ఆర్.వెంకటేశ్వర్లు, ఏ.నర్సింలు, జూపల్లి రమేష్, కుంచం శ్రీనివాస్, అశ్వాక్ అహ్మద్ ఖాన్, ఎల్.బాల్ కుమార్, కృష్ణ, కె.రవికుమార్ పాల్గొన్నారు.