కామారెడ్డి, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 100 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 44 లక్షల 74 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,453 మందికి 9 కోట్ల 02 లక్షల 99 వేల 800 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలను గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలో ఇచ్చిన పత్రాలను సకాలంలో తమ కార్యాలయంలో అందజేసినట్లైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులు ఇప్పించే విధంగా చూస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.