కామారెడ్డి, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంవత్సరంలో నాలుగు సార్లు కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం రాజకీయ పార్టీలకు ఓటర్ల నమోదుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. కొత్త ఓటర్ల నమోదులో రాజకీయ పార్టీల నాయకులు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఆధార్ లింక్ అవసరం లేదని, జాబితాలో మృతి చెందిన వారి పేర్లు తొలగించాలన్నారు.
ఆధార్ నమోదు కొత్త ఓటర్లు స్వచ్ఛందంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవో శీను, జిల్లా ఎన్నికల అధికారి సాయి భుజంగరావు, తహసిల్దార్ ప్రేమ్ కుమార్ అధికారులు ఇందిర, ప్రియదర్శిని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.