కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం రోడ్డు భద్రతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ …
Read More »Monthly Archives: July 2022
మళ్ళీ వస్తే అప్రమత్తంగా ఉండాలి
వేల్పూర్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు,నాయకులతో శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశ మయ్యారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలకు తమ తమ గ్రామాల్లో దెబ్బతిన్న చెరువులు, పంచాయితీ రాజ్ మరియు ఆర్‌అండ్‌బి పరిధిలోని రోడ్లు,బ్రిడ్జిలు, కల్వర్టులు …
Read More »పునరావాస చర్యలకు 101 సభ్యుల సైనిక బృందం
హైదరాబాద్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు గాను భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం పునరావాస చర్యలలలో పాల్గొంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత …
Read More »25 నుంచి వీఆర్‌ఏల సమ్మె
నందిపేట్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్ర వీఆర్‌ఎల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు సమ్మె చేపట్టనున్నట్లు శుక్రవారం నందిపేట్ వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ అనీల్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. గ్రామానికి సంబంధించిన విధులు నిర్వహిస్తామని, ఇతర విధులు నిర్వర్తించబోమని వారు తెలిపారు. ఈ నెల 25 నుంచి …
Read More »కృష్ణ జింక మృతి
నందిపేట్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని సిద్ధపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం జామున కృష్ణ జింక గుండె నొప్పితో మృతి చెందినట్లు నందిపేట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరిహక ప్రాంతంలో నీరు నిలిచి వన్యప్రాణుల కొరకు గ్రాసం లేకుండా అయిపోయిందన్నారు. ఆహార కొరత ఏర్పడడంతో …
Read More »పీజీ పరీక్షలు రీ షెడ్యూల్
నిజామాబాద్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జూలై 16వ తేదీన ప్రారంభం కావాల్సిన పీజీ మొదటి సంవత్సర పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా, రవాణా సదుపాయం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో పరీక్షలను రీషెడ్యూల్ చేసినట్లు గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల …
Read More »సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి
నిజామాబాద్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల నుండి ఏకధాటిగా కురిసిన వర్షాల కారణంగా ప్రజావసరాలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులకు కలెక్టర్ శుక్రవారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. వర్షాలు నిలిచిపోయినందున సహాయక చర్యలను వేగవంతం …
Read More »ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
నిజామాబాద్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్‌ను జిల్లా పాలనాధికారి సి. నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆలోచనలకు పదును పెట్టడమే కాకుండా సైన్స్‌పై ఆసక్తి పెంచి వారిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి ‘ఇంటింటా ఎన్నోవేటర్ ‘ కార్యక్రమం వేదికగా నిలుస్తోందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి ఆవిష్కరణలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నదన్నారు. ఇందులో ప్రధానంగా …
Read More »బాధిత కుటుంబాలకు టార్పాలిన్ల పంపిణీ
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ వర్షాల నేపథ్యంలో గృహాలు దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు టార్పాలిన్ కవర్లను గురువారం పంపిణీ చేసినట్లు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల్లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ సహకారంతో బాధితులకు టార్పాలిన్ కవర్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర …
Read More »ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించాలి
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయిల్ ఫామ్ సాగుపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం బిందు, తుంపర్ల సేద్యం పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని రైతు వేదికలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ తో పాటు రైతులకు అదనపు ఆదాయం …
Read More »