Monthly Archives: July 2022

విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి

కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మైనార్టీ బాలికల స్కూల్‌, జూనియర్‌ కళాశాలలో సోమవారం మధ్యాహ్న భోజనాన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్‌ పరిశీలించారు. విద్యార్థులకు వండే బియ్యాన్ని, పప్పులను చూశారు. వంటశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థీనులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని పేర్కొన్నారు.

Read More »

సోమవారం ప్రజావాణి రద్దు

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. బోనాల పండుగ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. జిల్లా ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు.

Read More »

పారిశుద్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలి

కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు రెండు వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారులు గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఆదివారం ఆయన పారిశుద్ధ్య కార్యక్రమాలపై జిల్లా పంచాయతీ అధికారులతో మాట్లాడారు. ఈనెల 24 నుంచి ఆగస్టు 2 వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను గ్రామాల్లో విస్తృతంగా చేపట్టాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో రోడ్లపై …

Read More »

వాహనాల చోరీ.. నిందితుడి అరెస్టు

ఆర్మూర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోటర్‌ సైకిళ్లను చోరీ చేస్తున్న పెర్కిట్‌కు చెందిన మహ్మద్‌ వాహీద్‌ అలీ (19) అనే దొంగను అరెస్టు చేసి పది మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. ఆర్మూర్‌ పట్టణంలోని సిద్దులగుట్ట వెనక గల దోబీఘాట్‌ వద్ద 63వ జాతీయ రహదారిపై …

Read More »

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే నెల ఆగస్టు ఒకటవ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ ఆదేశించారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలనిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్‌ శనివారం తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆగస్టు …

Read More »

కొత్త మండలాలు ఇవే…

హైదరాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాలనాసంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ దిశగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు దార్శనికతతో ఇప్పటికే నూతన జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు …

Read More »

అట్రాసిటీ కేసుల్లో త్వరితగతిన చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలి

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు హాజరయ్యారు. ఈ …

Read More »

సిపిఐ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లాగా పని చేయాలి

బోధన్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులను దేశం అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్న సమయంలో ప్రజా ఉద్యమమే ఏకైక మార్గమని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. సుధాకర్‌ పిలుపునిచ్చారు. అదే స్థాయిలో సిపిఐ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. శనివారం కోటగిరి మండల సిపిఐ మహాసభ కోటగిరిలోని గీతా పారిశ్రామిక సహకార సంఘ భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా …

Read More »

మార్కెట్లోకి స్వచ్చమైన తేనె ఉత్పత్తులు

హైదరాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల నుండి నేరుగా గిరిజనులు సేకరించిన పుట్టు తేనెను, ఏ మాత్రం రసాయనాలతో ప్రాసెస్‌ చేయకుండా నేరుగా స్వచ్ఛమైన తేనే విక్రయాలను ‘‘గిరి నేచర్‌’’ అనే పేరుతొ తెలంగాణా గిరిజన సహకార సంస్థ ప్రారంభించింది. గిరిజన స్వచ్ఛమైన తేనే ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ …

Read More »

26 నుండి ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 విద్యా సంవత్సరంలో ప్రాక్టికల్‌ పరీక్షలు ఫెయిల్‌ అయిన విద్యార్థులకు గైర్హాజరైన విద్యార్థులకు ఈనెల 26వ తేదీ మంగళవారం నుండి 30వ తేదీ శనివారం వరకు ప్రాక్టికల్‌ పరీక్షలను ఇంటర్‌ బోర్డు నిర్వహిస్తుందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. జనరల్‌ మరియు ఒకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరు కావలసిన అభ్యర్థులు తమ తమ కళాశాలలో నుండి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »