కామారెడ్డి, ఆగష్టు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కార్యాలయాల సముదాయమంలో కామారెడ్డి టి.ఎన్.జి.ఓస్ జిల్లా కార్యదర్శి బి.సాయిలు ఆధ్వర్యంలో సివిల్స్‌లో ర్యాంక్ సాధించిన సన్మాన గ్రహీతల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ జితేష్ వి.పాటిల్ సమక్షంలో ఘనంగా సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ పద్మ పే అండ్ అకౌంట్స్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా కామారెడ్డిలో పనిచేస్తున్న వారి కూతురు కుమారి అరుగుల స్నేహ సివిల్స్-2021 ఫలితాలలో 136 సాధించి ఐ.ఏ.ఎస్ కు సెలెక్ట్ కావడం కామారెడ్డి జిల్లాకే గర్వకారణం అన్నారు.
యువత సివిల్స్‌లో మరెన్నో విజయాలు సాధించి కామారెడ్డి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, ఇష్టపడి చదివితే- విజయం మన సొంతం అవుతుందని, సాధించలేనిది సృష్టిలో ఏదీ లేదని మట్టిలో మాణిక్యం మన కామారెడ్డి ముద్దు బిడ్డ అని కొనియాడారు. వారితో పాటు మరోక సివిల్స్ ర్యాంకర్ ఐ.ఏ.ఎస్ శ్రీనివాస్ (కాకినాడ) కి పుష్పగుచ్ఛం, మెమెంటోతో ఘనంగా సన్మానిస్తూ కామారెడ్డి జిల్లా యొక్క విశిష్టతను తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే, అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్, టి.జి.ఓస్ జిల్లా సెక్రెటరీ సాయిరెడ్డి, టి.ఎన్.జి.ఓస్ సహా అధ్యక్షులు యం.నాగరాజు, జిల్లా కోశాధికారి యం.దేవరాజ్, ఉపాధ్యక్షులు యు.సాయిలు, లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు సంతోష్, రాజ్ కుమార్, రూరల్ సెక్రెటరీ డి.జుగల్ కిషోర్, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.