వాణిజ్య శాస్త్ర విభాగంలో గంగాదర్‌కు పిహెచ్‌.డి

డిచ్‌పల్లి, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వాణిజ్య శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి మాచర్ల. గంగాదర్‌ కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ అవార్డు ప్రదానం చేయబడిరది. ఆచార్యులు ఎం.యాదగిరి పర్యవేక్షణలో పరిశోధకుడు మాచర్ల. గంగాదర్‌ ‘‘భారత దేశ బ్యాంకింగ్‌ రంగంలో బ్యాంకుల సంయోగం మరియు సంలీనం- భారతీయ స్టేట్‌ బ్యాంకులో అనుబంధ బ్యాంకుల విలీనం ఒక పరిశీలన’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంధాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు.

అందుకు గాను సోమవారం ఓపెన్‌ వైవా (బహిరంగ మౌఖిక పరీక్ష) నిర్వహించగా దీనికి స్వామి రామానంద తీర్థ మరట్వాడా విశ్వవిద్యాలయం, నాందేడ్‌ నుంచి సీనియర్‌ ఆచార్యులు. డి.ఎం. కందరే ఎక్సటర్నల్‌ ఎగ్జామినర్‌గా హాజరై పరిశోధకుడిని సిద్ధాంత గ్రంథంపై వివిధ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఉషోదయ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న మాచర్ల.గంగాదర్‌ జలాల్పూర్‌ గ్రామంలో ఒక నిరుపేద రైతుకుటుంబంలో పుట్టి పెరిగి స్టేట్‌ బ్యాంకు అనుబంధ బ్యాంకులు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో విలీనం తర్వాత బ్యాంకింగ్‌ రంగంలో జరిగిన మార్పును అధ్యయనం చేసినారు.

తాను ఆచార్య యాదగిరి గారి పర్యవేక్షణలో రూపొందించుకున్న ప్రశ్నావళి ద్యారా అధ్యయనం చేసి సరిjైున గణాంక పద్దతుల ద్వారా పరిష్కార మార్గాలను ప్రభుత్వానికి నివేదించడం అభినందనీయమని ఆచార్యులు. డి.ఎం. కందరే సంతృప్తి వ్యక్తం చేసి సిద్ధాంత గ్రంథం ప్రభుత్వ విధాన నిర్ణయాలకు దీక్సూచిగా ఉపయోగపడుతుందని తెలిపారు.

తెలంగాణ విశ్వవిద్యాలయంలోవాణిజ్య శాస్త్ర విభాగంలో పిహెచ్‌.డి. అవార్డులు ప్రదానం కావడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కే. శివశంకర్‌ హర్షం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో నిర్దిష్ట పరిశోధనల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసి పరిశోధక విద్యార్థి గంగాధర్‌ను అభినందించారు. గంగాధర్‌కు పీహెడీ అవార్డు అయినా సందర్బంగా ఉషోదయ విద్యాసంస్థల కరస్పాండెంట్‌ వి. సూర్యప్రకాష్‌, ప్రజాసంబంధాల డైరెక్టర్‌ డా.వి. త్రివేణి, అర్థశాస్త్రవిభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. ఏ. పున్నయ్య హర్షం వ్యక్తం చేసినారు. వైవా కార్యక్రమంలో విభాగ అధ్యాపకులు డా. శ్రీనివాస్‌, డా. గంగాధర్‌, డా.శ్వేతా, రాజ్‌ తదితర పరిశోధక విద్యార్థులతో పాటు వాణిజ్య శాస్త్ర విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »