మోస్రా, ఆగష్టు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్ రావ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర యూత్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి అన్నదానం, పండ్ల పంపిణీ చేశారు. మోస్రా మండలం చింతకుంట గ్రామంలోని అనాధ వృద్ధాశ్రమంలో వృద్దులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ పదవిలో లేకున్నా మధన్ మోహన్ రావ్ ప్రజలకు చేస్తున్న సేవలు చాలా గొప్పవని, ఇలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు జీవించాలని, ఎల్లప్పుడు భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఉన్నతమైన వ్యక్తి జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమంలో చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా సమయంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామంలో కరోనా నివారణకు స్ప్రే చేయించడం, ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోతున్న సమయంలో తాను స్వయంగా ఆక్సిజన్ అందించి చాలామంది ప్రాణాలు కాపాడారన్నారు.
కార్యక్రమంలో మోస్రా మండల పార్టీ అధ్యక్షులు కోత్మీర్కర్ లక్ష్మణ్, దామరంచ సొసైటి చైర్మన్ కమలాకర్ రెడ్డి, హరి నారాయణ, మాజీ ఎంపిటిసి కిషన్ రెడ్డి, చంద దత్తు, రెడ్డి రాంబాబు, నీరడి కృష్ణ, ఇంతియాజ్, దయానంద్, శ్రీధర్, ప్యాట్ల లక్ష్మయ్య, వినోద్, రాజు పాల్గొన్నారు.