కామారెడ్డి, ఆగష్టు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఏం గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఎన్నికల సామాగ్రిని భద్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. రికార్డులు పరిశీలించారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో సివిల్స్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నారు.
కళా భారతి వేదికను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం పరిశీలించారు. ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిమ్ పరికరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రామారెడ్డి రోడ్ లోని ధరణి టౌన్షిప్లో ఉన్న వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అధికారులు పాల్గొన్నారు.