కామారెడ్డి, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ లోని మీటింగ్ హాలులో ఐకెపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్త్రీ నిధి రుణాలు అర్హత గల సంఘాలకు ఇప్పించాలని సూచించారు.
గ్రామ సంఘాలను ఆర్థికంగా బలోపేతమయ్యే విధంగా చూడాలన్నారు. మండల సమైక్యల ద్వారా వ్యాపారాలు చేపట్టి లాభాలు సాధించే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సమావేశంలో డి ఆర్డిఓ సాయన్న, లీడ్ బ్యాంకు మేనేజర్ చిందం రమేష్, ఎం అదనపు డి ఆర్డిఓ మురళీకృష్ణ, డిపిఎంలు, ఐకెపి అధికారులు పాల్గొన్నారు.