కామారెడ్డి, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా కూచన్‌పల్లి గ్రామానికి చెందిన నవ్య (26) గర్భిణీకి అత్యవసరంగా ఏబీ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం మెదక్ జిల్లా కేంద్రంలో లభించకపోవడంతో వారు ఐవిఎఫ్ రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన నాగిర్తి రమేష్ సహకారంతో రెండు రోజుల క్రితం రక్తం అందజేయడంతో నేడు ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీ ఆరోగ్యవంతమైన మగ శిశువుకు జన్మనిచ్చారని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు పేర్కొన్నారు.
2007 నుండి నేటి వరకు వేలాదిమందికి రక్తాన్ని సకాలములో అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. ఎదుటివారిని కాపాడడం కోసం మనం చేసే సహాయం మనకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుందని రక్తదానానికి యువకులు ముందుకు రావాలన్నారు. గత 15 సంవత్సరాలలో వేలాది మందికి సకాలంలో రక్తాన్ని అందజేసి వారి ప్రాణాలను కాపాడడంలో కామారెడ్డి రక్తదాతలు తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారన్నారు.