బోధన్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, రానున్న ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగురకడం ఖాయమని బోధన్ నియోజకవర్గ భాజపా ఇంచార్జ్ మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం బోధన్ పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన …
Read More »Daily Archives: August 4, 2022
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలేలా వజ్రోత్సవాలు
కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు సహా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలన్నారు. గురువారం భారతస్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణపై కలెక్టరేట్ నుండి అన్ని …
Read More »బిల్లులు రాలేదని సర్పంచ్ భర్త ఆత్మహత్య
నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధి చేయాలని గ్రామ సర్పంచ్ భర్త అప్పులతో అభివృద్ధి చేసి ఇబ్బందుల్లో పడ్డారు. చేసిన పనులకు బిల్లులు రాక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వంత మండలం వేల్పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెల వడ్డెర కాలనీ సర్పంచ్ బలవన్మరణం పొందాడు. …
Read More »ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి
కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను అదేశించారు. గురువారం ఐడివోసిలోని జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో కొత్తగా నియామకమైన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో డిపిఆర్‌వో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు నిర్దేశిత …
Read More »నాలుగో రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నాలుగో రోజు ఉదయం, మధ్యాహ్నం ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం గణితం, జీవశాస్త్రం, చరిత్ర, సబ్జెక్టు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ ఉదయం ఆర్మూర్, బాల్కొండ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే మధ్యాహ్నం నిజామాబాద్‌లోని పలు కళాశాలలు తనిఖీ చేసి సమీక్షించారు. ఉదయం …
Read More »ధాన్యం మిల్లింగ్ వేగవంతం చేయాలి
కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్లు ధాన్యం మిల్లింగ్ వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల రైస్ మిల్లర్లతో ధాన్యం మిల్లింగ్ పై సమీక్ష నిర్వహించారు. మిల్లుల వారిగానే మిల్లింగ్ చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. డిప్యూటీ తాసిల్దార్లు రైస్ మిల్లులను …
Read More »నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలి
నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటే ప్రతి మొక్కకు తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.ఎం.డోబ్రియల్ సూచించారు. గురువారం ఆయన రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యాలయం అయిన అరణ్య భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల అటవీ శాఖ …
Read More »విఆర్‌ఏలవి న్యాయమైన కోరికలు
నందిపేట్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విఆర్‌ఏలవి న్యాయమైన కోరికలు అని మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ నాయకులు కంచెట్టిగంగాధర్, బిజెపి నందిపేట్ మండల ఇన్చార్జి స్రవంతి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విదంగా పేస్కెల్ వెంటనే అమలు చేసి వారి కోరికలను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విఆర్‌ఏల దీక్షలో భాగంగా గురువారం నందిపేట్ మండల భారతీయ …
Read More »బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలి
నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 7 న ఢల్లీిలో జరగనున్న ఓబీసీ మహాసభ పోస్టర్, కరపత్రాలను తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పోరేషన్ ఛైర్మన్ ఆకుల లలిత విడుదల చేశారు. కరపత్రాలను, పోస్టర్‌లను గురువారం ఉదయం కంఠేశ్వర్‌లో గల వారి స్వగృహం నందు విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగ ఉన్న బీసీలకు ఇంకా న్యాయం …
Read More »