కామారెడ్డి, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను అదేశించారు.
గురువారం ఐడివోసిలోని జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో కొత్తగా నియామకమైన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో డిపిఆర్‌వో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు నిర్దేశిత షెడ్యూల్‌కు అనుగుణంగా ప్రచారం కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు.
రోజువారీగా క్షేత్ర స్థాయిలో కళాకారుల చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి గ్రామ పంచాయితీ కార్యాలయం ధ్రువీకరించిన పత్రాలు, ఫోటోలు హైదరాబాద్ లోని హెడ్ ఆఫీస్ తెలంగాణ సాంస్కృతిక సారథి హెడ్ ఆఫీస్ కార్యాలయానికి, అలాగే జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయానికి పంపించాలని జిల్లా ప్రజా సంబంధాల అధికారి ఆదేశించారు.