నిజామాబాద్, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 7 న ఢల్లీిలో జరగనున్న ఓబీసీ మహాసభ పోస్టర్, కరపత్రాలను తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పోరేషన్ ఛైర్మన్ ఆకుల లలిత విడుదల చేశారు. కరపత్రాలను, పోస్టర్‌లను గురువారం ఉదయం కంఠేశ్వర్‌లో గల వారి స్వగృహం నందు విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగ ఉన్న బీసీలకు ఇంకా న్యాయం జరగడం లేదన్నారు.
బీసీలకు న్యాయం జరగాలంటే బీసీల కులగణన జరగాల్సిందే అన్నారు. బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కాలంటే కూడ బిసి కుల గణన జరగాల్సిందే అని పేర్కొన్నారు. చట్ట సభల్లో ఇంతవరకు అడుగు పెట్టని బీసీ కులాలు వందకు పైగానే ఉంటాయి కాబట్టి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలన్నారు.
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటేనే బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, ధర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, మాడవేడి వినోద్ కుమార్, బొడిగం గంగాధర్, మేరు గంగాకిషన్, బోనేకర్ భూమయ్య, అనిల్, విజయ్ కుమార్, బాలయ్య, సంజీవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.