కామారెడ్డి, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్లు ధాన్యం మిల్లింగ్ వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల రైస్ మిల్లర్లతో ధాన్యం మిల్లింగ్ పై సమీక్ష నిర్వహించారు.
మిల్లుల వారిగానే మిల్లింగ్ చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. డిప్యూటీ తాసిల్దార్లు రైస్ మిల్లులను సందర్శించాలని సూచించారు. సమావేశంలో సివిల్ సప్లై డిఎం జితేంద్రప్రసాద్, ఆర్డీవో శీను నాయక్, ఏఎస్వో వెంకటేశ్వర్లు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని రైస్ మిల్ల యజమానులు పాల్గొన్నారు.