నిజామాబాద్, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నాలుగో రోజు ఉదయం, మధ్యాహ్నం ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం గణితం, జీవశాస్త్రం, చరిత్ర, సబ్జెక్టు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ ఉదయం ఆర్మూర్, బాల్కొండ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు.
అలాగే మధ్యాహ్నం నిజామాబాద్‌లోని పలు కళాశాలలు తనిఖీ చేసి సమీక్షించారు. ఉదయం మొదటి సంవత్సరం పరీక్షకు మొత్తం 5,443 మంది విద్యార్థులకు గాను 5,142 మంది విద్యార్థులు హాజరుకాగా 301 మంది విద్యార్థులు గైర్ హాజర్ అయ్యారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు డాక్టర్ చిరంజీవి, కనకమహాలక్ష్మి 8 పరీక్ష కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు దేవరామ్, నర్సయ్య సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 14 పరీక్ష కేంద్రాలను, జిల్లా ఇంటర్ విద్యా అధికారి నాలుగు పరీక్ష కేంద్రాలను ఉదయం తనిఖీ చేశారు.
మధ్యాహ్నం మొత్తం 2,263 మంది విద్యార్థులకు గాను 2,099 మంది విద్యార్థులు హాజరుకాగా 164మంది విద్యార్థులు గైరహాజర్ అయ్యారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి నాలుగు పరీక్ష కేంద్రాలను, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు నాలుగు పరీక్ష కేంద్రాలను, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 14 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు.