నందిపేట్, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విఆర్‌ఏలవి న్యాయమైన కోరికలు అని మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ నాయకులు కంచెట్టిగంగాధర్, బిజెపి నందిపేట్ మండల ఇన్చార్జి స్రవంతి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విదంగా పేస్కెల్ వెంటనే అమలు చేసి వారి కోరికలను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విఆర్‌ఏల దీక్షలో భాగంగా గురువారం నందిపేట్ మండల భారతీయ జనతా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు సంఫీుభావం తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
అర్హత కల్గిన విఆర్‌ఏలకు ప్రమోషన్ కల్పించాలని 55 సంవత్సరాలు దాటినా విఆర్‌ఏలల వారసులకు ఉద్యోగం కల్పిస్తూ పెన్షన్ సౌకర్యం కల్పించాలని అలాగే రాష్ట్రవ్యాప్తంగా 200 మంది చనిపోయిన విఆర్‌ఏల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కి బీజేపీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లి న్యాయబద్ధంగా వారికి పైవన్నీ వర్తింపజేయాలని కోరుతామని అన్నారు.
కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు భూతం సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సూది సాయికుమార్, బీజేవైఎం ఉపాధ్యక్షులు నాగ సురేష్, కిసాన్ మోర్చా నందిపేట్ మండల అధ్యక్షులు గడ్డం చిన్నారెడ్డి, నాగ తారక్, వీరేశం, ఆరుట్ల రమేష్, గంగాధర్ గౌడ్, మహిళా మోర్చా నాయకురాలు భాగ్య, నర్మదా, విజయ, పొందపురం భోజన్న, రాజు, సాయన్న, విపుల్ రావు, లక్కంపల్లి రవి, పంచరెడ్డి ఎర్రన్న, మచ్చర్ల ప్రవీణ్, నరసయ్య, నవీన్, కమలం, కాక పురుషోత్తం, బోజారెడ్డి, మల్లారెడ్డి, అనిల్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.