బోధన్, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, రానున్న ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగురకడం ఖాయమని బోధన్ నియోజకవర్గ భాజపా ఇంచార్జ్ మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం బోధన్ పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈనెల 2న యాదాద్రిలో జరిగిన సభలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శేకావత్, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, నిజాంబాద్ జిల్లా ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో ఆలిండియా రైస్ మిల్ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా గురువారం బోధన్ నియోజక వర్గ ఇంచార్జి మేడపాటి ప్రకాష్ రెడ్డి స్వగృహంలో మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్న శుభసందర్భంగా బోధన్ బిజెపి పట్టణ నాయకులు ఆయనకు సన్మానం చేశారు. అనంతరం బిజెపి బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి మేడపాటి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీలోకి భారీగా వలసలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నారని కుటుంబ పాలనను అంతం చేసే సమయం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.
ప్రజాగోసా బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని 104 గ్రామాలు గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు ప్రజలు తెలంగాణ రాష్ట్ర పాలనలో విసిగిపోతున్నారని నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వారిని పట్టించుకునే నాధుడే కరువయ్యారని ప్రజాగోష కార్యక్రమంలో ప్రజలు విన్నవించారన్నారు.
అనంతరం బిజెపి కండువా కప్పుకున్న మోహన్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రజలవద్దకు వెళ్లి వారిని పరామర్శించే అవకాశానికి కూడా నోచుకోలేక పోయానని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శిని ఉండి కూడా రైతుల బాధలను వినికూడ పట్టించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయానన్నారు. బిజెపిలో ఉన్న నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపిలో కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు.
రానున్న రోజుల్లో బోధన్ నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. కార్యక్రమంలో రెంజల్ ఎంపిపి రజిని కిషోర్, జెడ్పిటిసి మేక విజయ సంతోష్, రెంజల్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రాజు, బోధన్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలిప్యక బాలరాజు, మండల అద్యక్షులు పోశెట్టి, మాజీ కౌన్సిలర్ రామరాజు, సుధాకర్ చారి, జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్ గౌడ్, ఎడపల్లి బీజేపీ మండల అద్యక్షులు కమలాకర్ రెడ్డి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.