కామారెడ్డి, ఆగష్టు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 7న జరిగే ఎస్ఐ పరీక్షకు ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం అధికారులతో ఎస్సై పరీక్ష పై సమీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి వేయించాలని సూచించారు.
అభ్యర్థులు ఉదయం తొమ్మిది గంటలకు పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని కోరారు. విద్యార్థుల కోసం బాన్సువాడ, ఎల్లారెడ్డి నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డీఈవో రాజు, అధికారులు పాల్గొన్నారు.