కామారెడ్డి, ఆగష్టు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
లాటరీ వచ్చిందని, జీఎస్టీ చెల్లించాలని మాయ మాటలు చెప్పి ఆన్లైన్లో మోసగాళ్లు నగదు దోచుకుంటున్నారని చెప్పారు. మాయమాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. డయల్ 1930 కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏఎస్‌పి అన్యోన్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.