కామారెడ్డి, ఆగష్టు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేనేత వస్త్రాలను ప్రజలు వినియోగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్టాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
చేనేత వారసత్వ సంపదను కాపాడాలని కోరారు. చేనేత వస్త్రాలను విరివిగా వాడుకోవాలని సూచించారు. చర్మానికి రక్షణగా ఉంటాయన్నారు. హుందాతనంను పెంచుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఏవో రవీందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.