కామారెడ్డి, ఆగష్టు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిజిటల్ సేవలను వినియోగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో బ్యాంకింగ్ ప్రణాళికలపై అవగాహన సమావేశం నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు జిల్లాలోని అన్ని బ్యాంకుల ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డులు ,మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలగు సౌకర్యాలను అందించాలని సూచించారు.
ఖాతాదారులు ఆన్లైన్ మోసాలకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండే పద్ధతులపై ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి బ్యాంక్ మేనేజర్లతో చర్చించారు. సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, రిజర్వ్ బ్యాంక్ అధికారి అలీ, యూనియన్ బ్యాంక్ డీజీఎం నరేంద్ర కుమార్ కెనరా బ్యాంక్ రీజినల్ హెడ్ శ్రీనివాసరావు లీడ్ బ్యాంక్ అధికారి చిందం రమేష్ ,అన్ని శాఖల మేనేజర్లు పాల్గొన్నారు.