కామారెడ్డి, ఆగష్టు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కళాభారతిలో పోటి పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థులతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు.
రక్తదానం చేసిన పోటీ పరీక్షల అభ్యర్థులను అభినందించారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న మాట్లాడారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదాన శిబిరాలు నిర్వహించి సరిపడ రక్తాన్ని అందించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రఘుకుమార్, డివిజన్ కార్యదర్శి జమీల్ అహ్మద్, మండల చైర్మన్ సతీష్ రెడ్డి, కరస్పాండెంట్ నరసింహ, వైద్యుడు శ్రీనివాస్, పవన్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.